సూపర్ స్టార్ మహేష్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే మహేష్ బాబుకి ఒక బామ్మ కూడా అభిమానిగా మారింది.రాజమండ్రికి చెందిన 106 సంవత్సరాల వయసుకలిగిన రేలంగి సత్యవతి అనే బామ్మకు మాత్రం మహేష్ అంటే వల్లమాలిన అభిమానం. ఎలాగైనా మహేష్ ను కలవాలని.. మహేష్ తో ఫోటో దిగాలని కల కన్నది. ఆ విషయం ఫ్యాన్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మహేష్ కు తెలిసింది.
మహేష్ వెంటనే స్పందించాడు. అమెరికా షూటింగ్ నుంచి వచ్చాక ఆమె కోరిక తీరుస్తానని చెప్పాడు.హైదరాబాద్ వచ్చిన వెంటనే మహేష్ ఆమెను రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు పిలిపించాడు. ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలో మహేష్ బాబును కలిసింది.మహేష్ బాబుతో ఫోటో దిగింది. అనంతరం సెట్స్ లోనే మహేష్ తో కలిసి లంచ్ చేసిందట. బామ్మ కోరిక ను మహేష్ అలా తీర్చాడు.